ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న విడుదలై ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ దర్శకులు వశిష్ట, బాబీ, యంగ్ హీరో సందీప్ కిషన్, ప్రముఖ రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయి కుమార్ మాట్లాడుతూ .. అమ్మానాన్నల ఆశీర్వాదంతో 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు ఇలా శంబాలతో హిట్టు ఇవ్వడం ఆడియెన్స్ గిఫ్ట్. సినిమా ఫ్లాప్ అయినా ప్రయత్నం ఆపొద్దు అని మా అమ్మ గారు నాకు చెబుతుండేవారు.అదే మాట ఆదికి కూడా చెప్పాను. నా సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఇలా శంబాలతో హిట్టు రావడం ఆనందంగా ఉంది. మహీధర్ రెడ్డి, రాజశేఖర్ గారు ఎంతో ప్యాషన్‌తో ఈ మూవీని నిర్మించారు. నిర్మాతలు సంతోషంగా ఉన్నంత వరకు ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. నిర్మాత పెట్టిన ఖర్చు రావాలి, దాంతో పాటుగా లాభాలు రావాలి. యుగంధర్ చాలా సైలెంట్‌గా ఉంటారు. ప్రస్థానం నుంచి సందీప్ కిషన్‌తో అదే అనుబంధం ఉంది. కోన వెంకట్ నాకు ఫ్యామిలీ లాంటివాడు.
నువ్వుగా వెళ్లి సక్సెస్ అయి రా అని నాతో మా నాన్న చెప్పారు. అదే మాటని ఆదికి నేను చెప్పాను. ఆది ఎక్కువగా మాట్లాడడు. ప్రేమ కావాలి నుంచి ఇప్పటి వరకు ఆది కష్టపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు శంబాలతో విజయం సాధించాడు.శంబాల ప్రివ్యూని చూసి ప్రతీ ఒక్కరూ పాజిటివ్‌గానే స్పందించారు. ప్రతీ ఒక్కరూ మన ఆది హిట్టు కొట్టారు అని చెబుతుంటే ఆనందంగా ఉంది. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన అభిమానులందరికీ థాంక్స్.ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు థాంక్స్ అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























