మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెద్ది షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో రామ్ చరణ్ ‘రా’ అండ్ ‘రస్టిక్’ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఢిల్లీ షెడ్యూల్లో భాగంగా రాష్ట్రపతి భవన్ ముందు రామ్ చరణ్ విజువల్స్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రపతి భవన్ వంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశాల్లో షూటింగ్ కోసం అనుమతులు లభించడం చాలా అరుదు. ఈ సినిమా కథ రీత్యా ఈ లొకేషన్ ఎంతో ముఖ్యం కావడంతో, చిత్ర యూనిట్ చాలా నెలల ముందే అనుమతులు తీసుకుని ఈ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.ఈనెల 25వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుందని సమాచారం.
ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు జమా మసీద్, ఎర్రకోట వంటి చారిత్రాత్మక కట్టడాల వద్ద కూడా కొన్ని సీన్లను షూట్ చేశారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























