కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ నుండి ఒక క్రేజీ అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘నదియా’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యశ్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ పోస్టర్‌ను పంచుకుంటూ కియారాను టాక్సిక్ ప్రపంచంలోకి ఆహ్వానించారు. ఈ లుక్ చూస్తుంటే కియారా తన కెరీర్‌లోనే ఒక భిన్నమైన పాత్రను పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. తల్లి అయిన తర్వాత కియారా నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కేజీఎఫ్ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యశ్ నుండి వస్తున్న సినిమా కావడంతో, దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జె.జె పెర్రీ ఆధ్వర్యంలో ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు.
టాక్సిక్ చిత్రం 2026 మార్చి 19న ఉగాది మరియు ఈద్ పర్వదినాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























