ఊరమాస్ బాక్సాఫీస్ ర్యాంపేజ్‌తో 2026 నెం.1 గ్రాసర్‌గా దూసుకుపోతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్ర బృందం ప్రేక్షకులకు మరియు అభిమానులకు ఊహించని సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటికే కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ 400కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన ఈ సినిమాకు, మేకర్స్ తాజాగా థియేటర్లలో అదనంగా 5 నిమిషాల 56 సెకండ్ల నిడివి గల సీన్లను యాడ్ చేస్తునట్లు మేకర్స్ ప్రకటించారు. ఈరోజు నుండి ఈ సీన్లను ప్రదర్శించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణంగా పెద్ద సినిమాలకు సెకండ్ వీక్‌లో కలెక్షన్లు కాస్త స్లో అవుతుంటాయి, కానీ ‘పెద్ది’ టీమ్ ఈ అదనపు 6 నిమిషాల సీన్లను జోడించి థియేటర్లలో మళ్లీ పూనకాలు తెప్పించడానికి పక్కాగా ప్లాన్ చేసింది. యాడ్ చేసిన ఈ కొత్త సీన్లలో మరింత పవర్‌ఫుల్ యాక్షన్ బ్లాక్స్, అదిరిపోయే ఎలివేషన్స్ మరియు థియేటర్లు దద్దరిల్లేలా కొన్ని క్రేజీ డైలాగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు కూడా ఈ సరికొత్త రష్ కోసం మళ్లీ థియేటర్ల వైపు పరుగులు తీసేలా ఈ స్ట్రాటజీని డిజైన్ చేశారు.
బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేసిన ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు , శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో వృద్ధి సినిమాస్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























