రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ కరుప్పు తో రానున్నాడు.ప్రముఖ కమెడియన్ ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ వుంది అంతే. వచ్చే వారంలో ఆ షూట్ ను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.త్వరలోనే సెకండ్ సింగిల్ ను వదలనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.అన్ని భాషలకు గాను ఈ రైట్స్ ను తీసుకుందని సమాచారం. అలాగే శాటిలైట్ రైట్స్ ను జీ తమిళ్ సొంతం చేసుకుందంట. డిజిటల్ రైట్స్ డీల్ కూడా పూర్తి కావడంతో సినిమాను జనవరిలో థియేటర్లలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.డివోషనల్ టచ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా స్వసికా ,కాళీ వెంకట్ ,నటరాజన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఇక సూర్య ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన 46వ సినిమా చేస్తున్నాడు.80 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇందులో ప్రేమలు బ్యూటీ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగ వంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాను కంప్లీట్ చేసి సూర్య నెక్స్ట్ జీతూ మాధవన్ డైరెక్షన్ లో తన 47వ సినిమా చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























