మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి నెక్స్ట్ వస్తున్న భారీ పాన్-ఇండియా మూవీ పెద్ది. ఈసినిమా నుండి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ రెస్పాన్స్ తెచ్చుకుంది.విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అదరగొట్టింది.ప్రస్తుతం ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి యూట్యూబ్ లో అతి తక్కువ రోజుల్లోనే 100మిలియన్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ ఈరోజు 82 సెకండ్ల నిడివి తో వున్న సాంగ్ మేకింగ్ వీడియో ను రిలీజ్ చేశారు. ఇందులో సాంగ్ కోసం ఎంత కష్టపడ్డారో చూపించారు.చికిరి సాంగ్ ఈఏడాది విడుదలైన అన్ని పాటల్లోకెల్లా ది బెస్ట్ సాంగ్ అనిపించుకుంది. ఏఆర్ రెహమాన్ కంపొజిషన్ లో వచ్చిన ఈసాంగ్ ను తెలుగు, హిందీ భాషల్లో మోహిత్ చౌహన్ పాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పాటలో రా, రస్టిక్‌గా కనిపించి పవర్ ఫుల్ గ్రేస్‌తో రామ్ చరణ్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన స్టెప్స్‌ను వేలాది మంది అభిమానులు రీక్రియేట్ చేస్తుండగా, సోషల్ మీడియాలో చికిరి ఫెస్టివల్ కొనసాగుతోంది.హై ఎనర్జీ డాన్స్ రీల్స్ నుంచి స్టైలిష్ ఎడిట్స్, ఫ్యాన్ ట్రిబ్యూట్స్ వరకూ టైమ్‌లైన్లు నిండిపోతున్నాయి.ఇక నెక్స్ట్ సాంగ్ ను డిసెంబర్ లో విడుదలచేయనున్నారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న పెద్ది విడుదలకు ముందే భారీ హైప్ సృష్టించింది. తొలి సింగిల్ గ్లోబల్ చార్ట్‌బస్టర్‌గా మారడంతో, సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకాయి. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది థియేటర్లలోకి రానుంది.జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























