ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఈరోజే థియేటర్లలోకి రాగా పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంటుంది. దాంతో మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది,. మరోవైపు ఈ చిత్రం నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ నుండి సాలిడ్ వసూళ్లను రాబట్టుకొని రామ్ కెరీర్ లో హైయెస్ట్ ప్రీమియర్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఈ చిత్రం సుమారు $100K (ఒక లక్ష అమెరికన్ డాలర్లు) వసూలు చేసింది.ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు 300k డాలర్ల వసూళ్లను రాబట్టుకోనుంది. ఓవర్సీస్ లో కూడా హిట్ టాక్ రావడంతో ఫుల్ రన్ లో ఈసినిమా 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది. రామ్ కు ఇదే ఫస్ట్ మిలియన్ డాలర్ మూవీ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా సూపర్ వసూళ్లను రాబట్టుకోనుంది.హిట్ టాక్ రావడంతో మ్యాట్నీ నుండి కలెక్షన్స్ పెరుగుతున్నాయి.మొదటి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 – 12 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టుకోనుంది.
మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రామ్ నటన , కథనం ,మ్యూజిక్ హైలైట్ అయ్యాయి. భాగ్య శ్రీ బోర్సే ఇందులో కథానాయికగా నటించగా వివేక్ మెర్విన్ సంగీతం అందించారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఇక ఈసినిమా తో రామ్ ఎట్టకేలకు కం బ్యాక్ ఇచ్చాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























