తమిళ హీరో కార్తీ నెక్స్ట్ వా వాతియార్ తో రానున్నాడు. నిజానికి ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమాకు మధ్యలో అనేక అడ్డంకులు వచ్చాయి. దాంతో షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక రీసెంట్ గానే షూట్ కూడా పూర్తి చేసుకోవడంతో రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. డిసెంబర్ 5న రిలీజ్ కానుందని చెప్పేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉండడం తో విడుదల వాయిదా వేశారు.డిసెంబర్ మూడో వారం లో లేదా చివర్లో విడుదలచేయాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.అందులో భాగంగా రేపు తెలుగు వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ టీజర్ ను లాంచ్ చేయనున్నాడు.
నలన్ కుమారస్వామి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది .సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్ నిర్మిస్తుంది.ఈరోజు ఈసినిమానుండి సెకండ్ సింగిల్ రానుంది. అయితే కేవలం తమిళ వెర్షన్ సాంగ్ మాత్రమే రిలీజ్ కానుంది.
ఇక ప్రస్తుతం కార్తీ మార్షల్ అనే సినిమా చేస్తున్నాడు. డ్రీ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుండగా తమిళ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























