నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’.వచ్చే నెల 5న భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతుంది.అందులో భాగంగా సినిమా బీజీఎమ్ కూడా లాక్ చేశారు. అఖండ నుండి వరుసగా బాలకృష్ణ సినిమాలకు పవర్ ఫుల్ బీజీఎమ్ ఇస్తూ వస్తున్నాడు సంగీత దర్శకుడు థమన్. ఇక ఇప్పుడు అఖండ 2 కి కూడా తన బీజీఎమ్ తో థియేటర్లలను షేక్ చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన సాంగ్స్ , ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారైంది.ఈ మెగా ఈవెంట్ నవంబర్ 28, శుక్రవారం నాడు జరుగనుంది. వేదికగా హైదరాబాద్‌లోని కూకట్పల్లి, కైత్లాపూర్ గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు.ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రారంభమవుతుంది.ఈ ఈవెంట్ లో మరో ట్రైలర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అఖండ 2లో సంయుక్త కథానాయికగా నటించగా బాలీవుడ్ బ్యూటీ హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది.యువ నటుడు ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషించాడు.14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రామ్ ఆచంట , గోపి అంచంట ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























