నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్లో హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అజయ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఇందులో సునీల్ గారు చాలా డిఫరెంట్ రోల్ చేశారు. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో రాధిక గారు చాలా చక్కని పాత్ర చేశారు. మా ఇద్దరికి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్ డార్క్ కామెడీ ఫిలిం.ఇప్పటివరకు చాలా డార్క్ కామెడీ సినిమాలు చూసుంటారు. కానీ ఇది ఫిమేల్ లీడ్ చేస్తున్న డార్క్ కామెడీ ఫిలిం. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఒక్క రోజులో జరిగే కథ.చాలా అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. ఇందులో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.షాన్ రోనాల్డ్ చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు.
మా డిఓపి ప్రతి ఫ్రేం ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చంద్రు గారు ఈ సినిమాని పక్కా కమర్షియల్ సినిమా గా తీశారు. తప్పకుండా ఈ సినిమా ధియేటర్స్ లో మిమ్మల్ని అందరిని అలరిస్తుంది. నన్ను రీటాగా అద్భుతంగా చూపించిన డైరెక్టర్ చంద్రు కి థాంక్స్. అలాగే మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. వాళ్ళు మహారాజా లాంటి అద్భుతమైన సినిమాలు తీశారు. ఈ సినిమాల్లో పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగు కన్నడలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కుమార్ గారికి థాంక్యూ. 28న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























