చార్మింగ్ స్టార్ శర్వానంద్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా బైకర్. బైక్ రేసింగ్ నేపథ్యంలో జరిగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.అభిషేక్ కంకర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఇక ఈసినిమా డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సివుండగా వాయిదా పడింది.ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ బీస్ట్‌ను తయారు చేయడానికి మా కాస్ట్ అండ్ క్రూ కౌంట్‌లెస్ గా కష్టపడ్డారు, కష్టపడుతున్నారు. మేము చూపించిన కొద్దిపాటి విజువల్స్ కంటే ఈ సినిమా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా చూడనంత గొప్పగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇలాంటి అనుభవాన్ని, ఇంతటి స్కేల్‌ను మీకు అందించాలని మేము కోరుకుంటున్నాము.
‘బైకర్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇంతకు ముందెన్నడూ లేని ఒక అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి బైకర్ రెడీ కావడానికి మరి కొన్ని రోజుల సమయం పడుతుందని అందువల్ల విడుదల వాయిదా పడింది” అని టీమ్ తమ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈసినిమా థియేటర్లలో 3D, 4DX తో పాటు మరెన్నో ఫార్మాట్లలో విడుదల కానుంది.మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్ గా నటించగా సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























