స్వయంభు రిలీజ్ డేట్ ఫిక్స్.. మేకింగ్ వీడియో రిలీజ్

Swayambhu Release Date Locked; Making Video Unveiled

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన కెరీర్‌లో 20వ చిత్రంగా, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘స్వయంభూ’. ఇక ఈరోజు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా, సినిమా మేకింగ్ విశేషాలను,సినిమా స్థాయిని వివరిస్తూ ‘రైజ్ ఆఫ్ స్వయంభూ పేరుతో 2 నిమిషాల 25 సెకన్ల ‘బిహైండ్ ది సీన్స్’ (BTS) వీడియోను విడుదల చేశారు. నిఖిల్ ఈ సినిమాలో వీరయోధుడి పాత్రలో కనిపిస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా కథ భారతీయ చరిత్రలో అంతగా తెలియని ఒక అధ్యాయం అని, ఇది భారతీయ సాంస్కృతిక గొప్పతనానికి నివాళి అని నిఖిల్ తెలిపారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు భరత్ కృష్ణమాచారి రెండేళ్లలో 170 రోజులు పనిచేశారని వీడియో ద్వారా వివరించారు. ఈ పీరియాడికల్ మూవీలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.