NC 24 టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్

NC 24 Title and First Look Unveiled

యువ సామ్రాట్ నాగ చైతన్య, తండేల్ భారీ విజయంతో తర్వాత విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజనరీ దర్శకుడు కార్తీక్ దండుతో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని మైథలాజికల్ థ్రిల్లర్ కోసం చేతులు కలిపారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ఎస్విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. రెండు ఆసక్తికరమైన గ్లింప్స్ తో ద్వారా భారీ అంచనాలను సృష్టించిన తర్వాత, నాగ చైతన్య పుట్టినరోజు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, మేకర్స్ ఇప్పుడు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. టీం అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి “వృషకర్మ” అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. వృషకర్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాగ చైతన్య చేతిలో సాలిడ్ రాడ్ పట్టుకుని ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. అతని చుట్టూ ఉన్న విజువల్ ఎగిరే ధూళి , పొగతో నిండి పవర్ ఫుల్ యాక్షన్ ని సూచిస్తోంది. బ్యాక్ డ్రాప్ లో పురాతన భవనాలు, ప్రకాశవంతమైన బంగారు కాంతితో కూడిన ఆకాశం కనిపిండం క్యురియాసిటీ మరింతగా పెంచింది. నాగ చైతన్య మజల్డ్ ఫిజిక్, ఇంటెన్స్ హావభావాలు… ఇవన్నీ అతని పాత్ర ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో చూపిస్తున్నాయి. ఇప్పటివరకు అతనికి ఇదే బెస్ట్ లుక్.

టైటిల్ రివీల్‌ ప్రేక్షకుల అంచనాలను కేవలం చేరడమే కాదు… వాటిని దాటి మరింత భారీ స్థాయి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ప్రామిస్ చేస్తోంది. కార్తిక్‌ డండు తన ప్రత్యేకమైన హిస్టరీ–పౌరాణిక జానర్ లో కలిపి రూపొందిస్తున్న వృశకర్మలో నాగ చైతన్య పూర్తిగా కొత్తగా, ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని లుక్‌లో అలరించనున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నాడు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.