మత్తువదలరా ,మత్తు వదలరా 2 తో ఆకట్టుకున్న డైరెక్టర్ రితేష్ రానా, కమెడియన్ సత్య కాంబినేషన్ లో మరో మూవీ రానున్న సంగతి తెలిసిందే.షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు.సత్య ఇందులో హీరోగా నటిస్తుండగా ఈరోజు ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ గా రానున్న ఈసినిమాకు జెట్లీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ పోస్టర్‌లో సత్య విమానం పైన ఎక్కి కామెడీ సినిమాలతో నేను విసిగిపోయానంటూ హీరో అవ్వబోతున్నానంటూ ఫన్నీగా ఫోజు ఇచ్చాడు.మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పాత్ర కథలో కీలకం కానుంది.మత్తు వదలరా ఫ్రాంచైజీలో భాగమైన వెన్నెల కిషోర్, అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.రితేష్ రానా గత హిట్లకు పని చేసిన కోర్ టెక్నికల్ టీం ఈ సినిమాకి వర్క్ చేస్తుంది. సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సరంగం, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్.వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























