రివ్యూ : జిగ్రీస్

jigris telugu review

నటీనటులు : కృష్ణ బూరుగుల , రామ్ నితిన్ , ధీరజ్ ఆత్రేయ , మని వాక
ఎడిటింగ్ : చాణక్య రెడ్డి తూరుపు
సినిమాటోగ్రఫీ : ఈశ్వర్ ఆదిత్య
సంగీతం : కమ్రాన్ సయ్యద్
దర్శకత్వం : హరీష్ రెడ్డి ఉప్పుల
నిర్మాత : కృష్ణ వొడపల్లి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కృష్ణ బూరుగుల , రామ్ నితిన్ , ధీరజ్ ఆత్రేయ , మని వాక ప్రధాన పాత్రల్లో హరీష్ రెడ్డి ఉప్పుల డైరెక్ట్ చేసిన సినిమా జిగ్రీస్.ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
కథ :

కార్తిక్ (కృష్ణ బూరుగుల ) ప్రవీణ్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వీరందరూ కలిసి మారుతీ 800 లో గోవా వెళ్లాలని ఓ రాత్రి తాగిన మైకంలో అనుకున్నదే తడవుగా బయలుదేరతారు.మార్గమధ్యంలో కారు ట్రబుల్ ఇస్తుంది.దాన్ని రిపేర్ చేసే క్రమంలో సినిమాలో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వస్తుంది.అక్కడి నుండి తిరిగి ప్రయాణమైన వీరు చివరుకు గోవా చేరుకున్నారా..? అసలు ఆ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. గోవాలో ఏం చేసారు. ఆ ప్రయాణం వీరి జీవితంలో తీసుకువచ్చిన మార్పులేంటి అనేది మిగిలిన కథ..


విశ్లేషణ :

నలుగురు స్నేహితుల కథ తో వచ్చిన ఈ జిగ్రీస్ ని హిలేరియస్ ఫన్ తో నడిపించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ముఖ్యంగా లారీ సీన్, ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్ నవ్వులు పూయిస్తాయి. అలాగే కండోమ్ సీన్ హిలేరియస్ గా నవ్విస్తుంది.మావోయిస్టుల బ్లాక్ కూడా మెప్పిస్తుంది.ఈ కథలో అహా ఓహో అనే మలుపులు ఉండవు. కాని అరే మన గ్యాంగ్ కూడా ఇలాంటిదే కదా, మన ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వాళ్ళే కద అనిపిస్తుంది. మన కథని మనం తెరపై చూసుకుంటున్నట్టు ఉంటుంది. కానీ చివర 15 నిమిషాలు మాత్రం మనసుని ఎంతో బరువెక్కిస్తుంది. అలా జరగకుండా ఉంటే బాగుండేది కదానిపిస్తుంది. తడిసిన కళ్లతో చెమర్చిన భావోద్వేగంతో బయటకు వస్తారు.

నటీనటుల విషయానికి వస్తే లీడ్ రోల్ చేసిన కృష్ణ బూరుగుల పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు స్టీల్ చేసాడు.మ్యాడ్ ఫేమ్ రామ్ తన రోల్ లో బానే చేసాడు. ధీరజ్ ఆత్రేయ చాలా సహజంగా, అమాయమైన నటనతో కామెడీ పండించాడు. మనీ వాక సినిమాలో కీలకమైన పాత్ర, అసలు కథ మెుత్తం తన చుట్టూనే తిరుగుతుంది. అయితే ఎమోషన్ సీన్స్ కూడా బాగానే చేశాడు.

టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపిస్తుంది.సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ గా బాగుంది.విజువల్స్ క్వాలిటీ గా వున్నాయి. కమ్రాన్ మ్యూజిక్ ,బీజీఎమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రోడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఓవరాల్ గా జిగ్రీస్.. మన చిన్ననాటి జాన్ జిగ్రిలతో గడిపిన క్షణాలని మరోకసారి గుర్తు చేసే సినిమా.. ఫ్రెండ్స్ తో వెళ్లి థియేటర్లలో ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.