రివ్యూ : కాంత

kaantha review in telugu

నటీనటులు : దుల్కర్ సల్మాన్ , రానా దగ్గుబాటి , భాగ్య శ్రీ బోర్సే , సముద్రఖని
ఎడిటింగ్ : లెవెలిన్ అంథోని గొంజల్వెజ్
సినిమాటోగ్రఫీ : డానీ సాంజేజ్ లోపేజ్
సంగీతం : జాను చందర్
దర్శకత్వం : సెల్వమణి సెల్వరాజ్
నిర్మాతలు : దుల్కర్ సల్మాన్ , రానా దగ్గుబాటి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కథ:

కాంత సినిమా కథ 1950ల నాటి సినిమా పరిశ్రమ నేపథ్యంలో సాగుతుంది. అయ్య (సముద్రఖని) అనే దర్శకుడు, తాను స్టార్‌గా చేసిన టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) మధ్య ఉండే ఈగో క్లాష్ చుట్టూ తిరిగే కథ ఇది. అయ్య తన తల్లి జీవితం ఆధారంగా ‘శాంత’ అనే సినిమా తీయాలనుకుంటాడు, కానీ మహదేవన్ చెప్పిన క్లైమాక్స్, టైటిల్ మార్పు (శాంత నుండి కాంతగా) వంటి షరతుల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. వీళ్లిద్దరి మధ్య నలిగిపోయే హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే). అయితే సినిమా షూటింగ్ పూర్తయ్యే దశలో ఒక హత్య జరుగుతుంది. ఈ హత్య కేసును దర్యాప్తు చేయడానికి ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ? హత్య చేసింది ఎవరు? చివరికి సినిమా విడుదలైందా? అనే అంశాలను తెరపై చూడాలి.

విశ్లేషణ :

సినిమా పరిశ్రమలోని అంతర్గత రాజకీయాలు, ఈగోల క్లాష్‌ను చూపించిన తీరు అద్భుతంగా ఉంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ పిరియాడిక్ డ్రామాను ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా మార్చే ప్రయత్నం చేశాడు. మొదటి భాగంలో గురుశిష్యుల మధ్య ఆధిపత్య పోరు సన్నివేశాలు, హీరోయిన్ పాత్ర పరిచయం ఆసక్తికరంగా సాగుతాయి. అయితే, హత్య జరిగిన తర్వాత సెకండాఫ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మరియు హత్య వెనుక ఉన్న నిజం ప్రేక్షకులపై మంచి ఇంపాక్ట్‌ను చూపుతుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రధాన బలం, 1950ల నాటి వాతావరణాన్ని విజువల్స్‌లో చక్కగా చూపించారు.

నటీనటుల విషయానికి వస్తే నటచక్రవర్తి మహదేవన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ జీవించారు. ఇది ఆయన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని, జాతీయ అవార్డు ఇచ్చే యాక్టింగ్ చేసి అదరగొట్టాడు దుల్కర్. చాలా సహజమైన నటన తో మెప్పించారు. సముద్రఖని దర్శకుడు అయ్య పాత్రలో తన లోతైన నటనతో దుల్కర్‌కు పోటీనిచ్చారు. సెకండాఫ్‌లో ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ పాత్రలో రానా దగ్గుబాటి తన ఉనికిని బలంగా చాటుకున్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా గ్లామర్ రోల్స్‌కు భిన్నంగా తన నటనతో ఆకట్టుకుంది.

టెక్నికల్ కూడా సినిమా బాగానే అనిపించింది. సినిమాటోగ్రఫీ సూపర్ అనేలా వుంది. సినిమా మూడ్ ను ప్రతిభింబించేలా విజువల్స్ వున్నాయి. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుండు.నిర్మాణ విలువలు ఉన్నతంగా వుంది.

ముగింపు :

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన కాంత ఆకట్టుకుందనే చెప్పొచ్చు. కేవలం నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోసమైనా ఈసినిమా చూడొచ్చు అనేలా వుంది. పీరియాడిక్ విజువల్స్ మరియు బలమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. పీరియాడిక్ డ్రామాలు, క్యారెక్టర్ డ్రైవెన్ సినిమాలు, మరియు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.