పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ -అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ గురించిన తాజా అప్‌డేట్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా అందించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క షూటింగ్‌ను నవంబర్ నెలాఖరులో ప్రారంభించబోతున్నట్లు ఓ ఈవెంట్ లో సందీప్ రెడ్డి వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నవంబర్ తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ కొనసాగబోతోందనిఈ చిత్రాన్ని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించారు.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో నటిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను సందీప్ రెడ్డి ఖండించారు.
యానిమల్ ఫేమ్ నటి తృప్తి డిమ్రీ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుండగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నాయి. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పిరిట్ ఎట్టకేలకు నవంబర్ నెలాఖరు నుండి సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధమవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























