కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి డ్యూడ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లపైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా.ఇంతకుముందు లవ్ టుడే ,డ్రాగన్ లతో ఈ క్లబ్ లో చేరాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక డ్యూడ్ ఓటీటీ లోకి వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను పాన్ ఇండియా భాషల్లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.మరి ఓటీటీలో ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. డ్యూడ్ ను కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటించింది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
ఇక ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) తో రానున్నాడు. ఈఏడాది తనకు ఇది థర్డ్ రిలీజ్ కానుంది. విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.డిసెంబర్ 18న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. మరి ఈసినిమాతో విజయాన్ని అందుకొని ఈ ఏడాది ప్రదీప్ హ్యాట్రిక్ విజయాలను అందుకుంటాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























