కొత్త లుక్ లో ఎన్టీఆర్ .. పిక్స్ వైరల్ 

NTR’s Latest Pics in a New Look Go Viral on Social Media

మ్యాన్ ఆఫ్ మాసెస్  జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త లుక్‌తో కనబడిన పిక్స్  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ తాజా లుక్ ఆయన రాబోయే పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) కోసమే.ఈ ఫొటోల్లో గతంలో కంటే ఎన్టీఆర్ చాలా బరువు తగ్గి, లీన్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు.ఈ సన్నబడిన లుక్ పట్ల కొందరు అభిమానులు మొదట్లో ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ,ఆయన పాత్రకు తగినట్టుగా ఈ మార్పు చేసుకున్నారని తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా బయటికొచ్చిన ఫోటోలు, వీడియోలలో ఎన్టీఆర్ గుబురు గడ్డంతో రగ్గడ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.చెక్ షర్ట్, బ్లాక్ కోట్, గాగుల్స్‌తో ఆయన లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.ఈ తాజా లుక్‌లో ఎన్టీఆర్ మీసం మెలేస్తూ కనిపించడం ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోల మేకోవర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, ఎన్టీఆర్ కూడా అందుకు తగట్లు సిద్ధమవుతున్నారు.ఈసినిమాలో ఎన్టీఆర్  పవర్ ఫుల్, వైల్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.ఇక ‘డ్రాగన్’ సినిమా తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే యూరప్‌లో ప్లాన్ చేస్తున్నారు.ఈ షెడ్యూల్‌లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారని సమాచారం.మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.