సింగర్ గా మారిన నవీన్ పొలిశెట్టి

Multi Talented Naveen Polishetty Makes Singing Debut

సినిమా సినిమా కు చాలా గ్యాప్ తీసుకొని ప్రామిసింగ్ కంటెంట్ తో వరుస విజయాలు దక్కించుకుంటున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజై రెండేళ్లు దాటినా ఇప్పటివరకు నవీన్ మరో సినిమాను కంప్లీట్ చేయలేదు.ఇక ఈహీరో ప్రస్తుతం అనగనగా ఒక రాజు చేస్తున్నాడు. మారి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా కోసం నవీన్ తొలిసారిగా సింగర్ గా కూడా మారారు. జాతి రత్నాలు ,మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలతో యువ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నవీన్, ఈసారి తన లోని కొత్త టాలెంట్‌ను పరిచయం చేయనున్నాడు.మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఒక మాస్ ఎంటర్‌టైనర్ పాటను నవీన్ పొలిశెట్టి పాడినట్లు తెలుస్తోంది.ఈపాట ఈనెల మూడో వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక నవీన్ పొలిశెట్టి తన మార్క్ ప్రమోషన్ స్టైల్‌తో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ప్రీ-వెడ్డింగ్ వీడియో’ ఆయన కామెడీ టైమింగ్‌కు నిదర్శనంగా నిలిచింది.ఈ పాట కూడా సినిమాకు హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.