పదేళ్ల క్రితం భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి: ది బిగినింగ్ ఆ తరువాత రెండేళ్ల క్రితం వచ్చిన బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రాలను కలిపి, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ రెండు భాగాలను ఒకేసారి,ఒకే టికెట్‌పై చూసే అవకాశం ప్రేక్షకుడికి దక్కింది. ఈరోజే ఈసినిమా విడుదలైంది.మరి ఈ ఎపిక్ ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో రివ్యూలో తెలుసుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్లేషణ :
కథ తెలిసి ఉన్నా సరే, మహిష్మతి రాజ్యాన్ని, అందులోని శక్తివంతమైన పాత్రల ప్రయాణాన్ని మళ్లీ పెద్ద తెరపై చూస్తున్నంత సేపు ది ఎపిక్ ఒక కొత్త సినిమా చూసిన అనుభూతిని ఇస్తుంది. రాజమౌళి తనదైన మ్యాజిక్‌తో ప్రేక్షకులను మరోసారి ఆ ప్రపంచంలో లీనం చేశారు. ఎడిటింగ్‌లో మార్పులు చేసి వేగవంతమైన కథనంతో ది ఎపిక్ ప్రేక్షకులముందుకు తీసుకొచ్చారు.ఈ ఎపిక్ వెర్షన్లో కొత్త సన్నివేశాలేమీ లేవు, కానీ ఎడిటింగ్‌లో కీలక మార్పులు చేశారు.
మొదటి భాగం ‘పచ్చబొట్టేసినా’ పాటతో పాటు, శివుడు (ప్రభాస్), అవంతిక (తమన్నా) మధ్య ప్రేమ కథా భాగాన్ని కట్ చేశారు. ఆ కథనంతా రాజమౌళి తన వాయిస్ ఓవర్ ద్వారా వేగంగా చెప్పేశారు అలాగే తొలి భాగంలోని యుద్ధ ఎపిసోడ్లను కూడా కొంత కుదించడం వలన, అవి మరింత ఆసక్తికరంగా మారాయి.మొదటి భాగం చివర్లో, “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ఇక రెండేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదుఅని సూచిస్తూ కథను రెండో భాగంలోకి తీసుకెళ్లారు.
ఇక రెండో భాగం భావోద్వేగాల జడివాన:’బాహుబలి: ది కన్‌క్లూజన్’ కథతో కూడిన ద్వితీయార్ధం, ఎటువంటి మార్పులు లేకుండా, ప్రేక్షకులను భావోద్వేగాల జడిలో ముంచేస్తుంది. ఇది అసలైన జక్కన్న మేజిక్. రెండు భాగాల నుండీ దాదాపు తొంభై నిమిషాలకు పైగా సన్నివేశాలను తొలగించినప్పటికీ, కథాగమనం లేదా అనుభూతిపై ఎక్కడా ఆ ప్రభావం కనిపించకుండా రాజమౌళి జాగ్రత్తపడ్డారు.ముఖ్యంగా, సన్నివేశాలు మారినప్పుడు వచ్చే సాంకేతిక సమస్యల కోసం సంగీతం, విజువల్స్‌పై ప్రత్యేకంగా రీవర్క్ చేసినట్టు అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ ను రాయల్ లుక్‌లో మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడటం అభిమానులకు పండగలాంటి అనుభూతి.అమరేంద్ర బాహుబలి , మహేంద్ర బాహుబలి గా ప్రభాస్ నటన అదరహో అనిపిస్తుంది. అలాగే భల్లాల దేవగా రానా, శివగామిగా రమ్యకృష్ణ, దేవసేనగా అనుష్క, కట్టప్పగా సత్యరాజ్ నటన మరోసారి మైమరిపిస్తుంది.
టెక్నీకల్ గా సినిమా ఉన్నతంగా వుంది.కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం మరింత కొత్త హంగులు అద్దుకొని వేరే స్థాయిలో ఉంది.విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు.
ముగింపు:
భారతీయ సినిమాకు పాన్ ఇండియా ట్రెండ్‌ను పరిచయం చేసిన బాహుబలిప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు.దీనికి కొనసాగింపుగా బాహుబలి: ది ఎటర్నల్ వార్ అనే యానిమేషన్ మూవీ కూడా రూపొందుతుంది.అందుకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని బాహుబలి ది ఎపిక్ లో ప్రదర్శించారు.బాహుబలి: ది ఎపిక్ అనేది కేవలం ఇది కేవలం ఒక సినిమా కాదు, రెండు అద్భుతాల మహాసమ్మేళనం, ఇది ప్రేక్షకులను మరోసారి మాహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్లి ఒక ఎపిక్ అనుభవాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























