నారా వారి కుటుంబంలో పెళ్లి సందడి అంగరంగ వైభవంగా జరిగింది.టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి శిరీష లేళ్ల (సిరి) వివాహం గురువారం రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మా ఇంటి పెళ్లి సందడి… నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఈ పెళ్లి సంబరాలు అక్టోబర్ 25న హల్దీ వేడుకతో మొదలై, అక్టోబర్ 26న పెళ్లికొడుకు కార్యక్రమం, 28న మెహందీ, 29న సంగీత్ నైట్ వంటి వేడుకలతో నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగాయి.
‘ప్రతినిధి-2’ సినిమా సెట్స్‌లో చిగురించిన నారా రోహిత్, శిరీషల ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటయ్యింది. గత ఏడాది నిశ్చితార్థం జరిగినప్పటికీ, రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మరణంతో పెళ్లిని వాయిదా వేయగా, దాదాపు ఏడాది తర్వాత ఈ వివాహం ఘనంగా జరిగింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























