గగన్ క్యారెక్టర్ రాయడానికి చాలా తెలుగు సినిమాలు ఇన్స్పిరేషన్ – కీర్తిశ్వరన్

Many Telugu Films Inspired Me to Write Gagan’s Character in Dude says Keerthiswaran

ప్రదీప్ రంగనాథన్ హీరోగా డైరెక్టర్ కీర్తిశ్వరన్ తెరకెక్కించిన సినిమా డ్యూడ్.కీర్తిశ్వరన్ కు ఇదే మొదటి సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటించగా,శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.ఈ సందర్భంగా మేకర్స్ డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 cr జర్నీ ఈవెంట్ ని నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ కీర్తి ఈశ్వర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.ప్రదీప్ రంగనాథన్ కి ఇది హ్యాట్రిక్ మూవీ.ఇది నా ఫస్ట్ సినిమా.ఇలాంటి కొలబరేషన్లో అద్భుతమైన విజయం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ఆడియన్స్ కి కృతజ్ఞతలు.ఈ సినిమాలో గగన్ క్యారెక్టర్ రాయడానికి చాలా తెలుగు సినిమాల ఇన్స్పిరేషన్ ఉంది.తెలుగు రాష్ట్రాల్లో సినిమా అద్భుతంగా రన్ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్ గారికి రవి గారికి థాంక్యూ.ప్రదీప్, మమిత అలాగే మా టీమ్ అందరికీ థాంక్యు వెరీ మచ్.

ఇక మొదటి సినిమాతోనే 100కోట్ల సినిమా ఇచ్చిన కీర్తిశ్వరన్ నెక్స్ట్ సినిమా ను ఓ స్టార్ హీరోతో చేయాలనుకుంటున్నాడు. త్వరలోనే తన నెక్స్ట్ మూవీ వివరాలు వెలుబడనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.