మైత్రికి ప్రతి నెల ఒక బ్లాక్ బస్టర్ వస్తుంది – నిర్మాత ఎస్ కె ఎన్

Producer SKN Says Mythri Delivers a Blockbuster Every Month

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సాలిడ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 cr జర్నీ ఈవెంట్ ని నిర్వహించారు.ఈ ఈవెంట్ ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ గెస్ట్ గా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక ఈ ఈవెంట్ లో ఎస్ కె ఎన్ మాట్లాడుతూ… మైత్రి మూవీ మేకర్స్ 2000 కోట్ల సినిమాని చూసిన నిర్మాతలు. వారికి ప్రతి నెల ఒక బ్లాక్ బస్టర్ వస్తుంటుంది. దీపావళికి వచ్చిన ఈ సినిమా పాన్ సౌత్ బ్లాక్ బాస్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారి విజన్ వేరు. వాళ్ళ కిరీటంలో మరో మైలురాయి చేరినందుకు అభినందనలు. తొలి సినిమా విజయం సాధించడం చాలా స్పెషల్ అందులో 100 కోట్ల సినిమా సాధించిన డైరెక్టర్ కీర్తికి కంగ్రాట్స్.
ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సుకుమార్ గారి సినిమా చూస్తున్నంత ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాను. మమిత లక్కీ హ్యాండ్. అద్భుతంగా నటించారు.తనకు మరెన్నో విజయాలు రావాలని కోరుకుంటున్నాను.

సినిమా విషయానికొస్తే తెలుగు, తమిళ్ ఒకే స్టేట్. తమిళ్ స్టార్స్ కూడా మా స్టార్స్ గానే ఫీల్ అవుతాము. కమల్ హాసన్ గారు, రజినీకాంత్ గారు, సూర్య గారు, అజిత్ గారు, ధనుష్ గారు, విజయ్ సేతుపతి గారు ఇలా ఎవరొచ్చినా సరే మా సొంత సినిమాలానే ప్రేమిస్తాం. ప్రదీప్ గారు కూడా ఇప్పుడు ఈ ఎలైట్ క్లబ్ లో జాయిన్ అయ్యారు. మూడుసార్లు ఇండస్ట్రీని షేక్ చేసి వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చారు. ప్రదీప్ గారు కేవలం హీరో మెటీరియల్ కాదు యాక్టర్ మెటీరియల్, స్టార్ మెటీరియల్. ప్రదీప్ గారు ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని, మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.