కాంతార చాప్టర్ 1 చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాను – అల్లు అర్జున్ 

Kantara Chapter 1 Left Me in a Trance Says Allu Arjun

దసరా రోజు విడుదలై థియేటర్లలో బ్లాక్ బస్టర్ రన్  కొనసాగిస్తున్న కన్నడ చిత్రం కాంతార చాప్టర్ 1.కాంతార ప్రీక్వెల్ గా వచ్చిన ఈసినిమా ఇప్పటికే  పలు రికార్డులు సృష్టించింది.ఇక  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  ఈసినిమాను చూసి మైమరిచిపోయారు.ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, సోషల్ మీడియా వేదికగా తన అనుభూతిని అభిమానులతో పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్న రాత్రి నేను కాంతార చాప్టర్ 1చూశాను.ఇది ఒక మైండ్‌బ్లోయింగ్ చిత్రం.సినిమా చూస్తున్నంత సేపు నేను ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాను అని బన్నీ తన ఎక్స్  పోస్ట్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా కథానాయకుడి పాత్ర పోషించి,దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో చేశారు.ఆయన ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించారు అంటూ కితాబిచ్చారు. అంతేకాకుండా రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్య వంటి ఇతర నటీనటుల నటనను, సంగీత దర్శకుడు అజనీశ్, సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్, ఆర్ట్ డైరెక్టర్ ధరణి గంగే, స్టంట్ మాస్టర్ అర్జున్ రాజ్‌ల పనితీరును కూడా అల్లు అర్జున్ మెచ్చుకున్నారు.ఇంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన విజయ్ కిరగందూర్, హోంబలే ఫిలిమ్స్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

నిజం చెప్పాలంటే కాంతార చాప్టర్ 1 అనుభవాన్ని వివరించడానికి మాటలు సరిపోవడం లేదని చెబుతూ అల్లు అర్జున్ తన పోస్ట్‌ను ముగించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిన్నటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ.818 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ కూడా లేకపోలేదు.   

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.