7 భాషల్లో ఓటీటీ లోకి రానున్న కొత్త లోక 

Lokah Chapter-1 to Stream on JioHotstar from October 31st

మలయాళ ఇండస్ట్రీ హిట్ లోక: చాప్టర్ 1 -చంద్ర సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు చివర్లో  థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా చరిత్ర సృష్టించింది.ఇక ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేవలం తెలుగులోనే కాకుండా, మలయాళం, తమిళం,కన్నడ ,హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ ఈ చిత్రం ఓటీటీ లోకి అందుబాటులోకి రానుంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి విడుదలైన 40 రోజుల్లోనే రూ. 300 కోట్లు వసూలు చేసి మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా (మోహన్‌లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ రికార్డును బద్దలు కొట్టి) సరికొత్త రికార్డును నెలకొల్పింది.తెలుగులో ఈసినిమా  కొత్త లోక గా విడుదలై  సూపర్ హిట్ అనిపించుకుంది. 

 కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన ఈసినిమాలో నస్లేన్, శాండి మాస్టర్ కీలక పత్రాలు పోషించిన ఈ సినిమాకు సామ్ సీఎస్  సంగీతం అందించాడు. ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ ఈసినిమాను నిర్మించాడు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.