వీరసింహా రెడ్డి తరువాత డైరెక్టర్ గోపిచంద్ మలినేని తో నటసింహం నందమూరి బాలకృష్ణ మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈసినిమా ఈరోజే పూజా కార్యక్రమాలతో లాంఛ్ కావాల్సివుండగా వాయిదాపడింది.ఇక లాంఛింగ్ కోసం కొత్త తేదీని కూడా ఖరారు చేశారని సమాచారం.ఈ చిత్రాన్ని నవంబర్ 7న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అలాగే అదే నెల మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇది టైమ్ ట్రావెల్ తరహా షేడ్స్‌తో కూడిన కథ అని బాలకృష్ణను ఇందులో పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పవర్ఫుల్ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందించనుండగా ‘కాంతార’ వంటి చిత్రాలకు పనిచేసిన అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.
ఇక ఈసినిమా కన్నా ముందు బాలకృష్ణ అఖండ 2 తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. డిసెంబర్ 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























