జైలర్ 2 సెన్సార్ పూర్తి: పర్ఫెక్ట్ రన్‌టైమ్‌తో యు/ఎ సర్టిఫికేట్..

Jailer 2 Completes Censor Formalities

బాక్సాఫీస్ వద్ద రజినీ ‘సంభవం’ ఖాయం! కులీ పాఠాల నుంచి కోలుకుని ఫ్యామిలీ ఆడియన్స్‌‌కు చేరువగా.. ఈ వీకెండ్ తలైవర్ ఇంటర్వ్యూతో ఆకాశాన్ని తాకనున్న హైప్!సూపర్‌స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A 16+ సర్టిఫికేట్‌ను జారీ చేయగా, లాక్ అయిన అధికారిక రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలు (165 నిమిషాలు) గా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ‘జైలర్ 2’ కి యు/ఎ సర్టిఫికేట్ రావడంతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రన్ టైమ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండటం చిత్ర విజయంపై నమ్మకాన్ని పెంచింది.

ఇదిలా ఉండగా, ఈ వీకెండ్‌లో రాబోతున్న తలైవర్ రజినీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచనుంది. తనదైన శైలిలో లైఫ్ పాఠాలు, ఫన్నీ కామెంట్స్‌తో సాగే ఈ ఇంటర్వ్యూ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగులో ఈసినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.