ప్రభాస్ హను టైటిల్ పోస్టర్ రానుంది

Prabhas–Hanu Film Title Poster Announcement tomorrow

రెబల్ స్టార్ ప్రభాస్- డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. టి సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు.సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈసినిమా నుండి రేపు టైటిల్ పోస్టర్ రిలీజ్ కానుంది. అందులో భాగంగా ఈరోజు టైటిల్ టీజ్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది. రేపు ఉదయం 11:07 గంటలకు టైటిల్ తోపాటు ఫుల్ పోస్టర్ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్ స్పై రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారం లో వుంది. మరి ఇదే టైటిల్ ఉంచుతారో లేదో రేపు క్లారిటీ రానుంది. ఈసినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనుండగా ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.తనకు ఇదే మొదటి సినిమా.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అనిల్ విలాస్ జాధవ్ చేపట్టగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.ఈసినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 14న థియేటర్లలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.