హీరో నారా రోహిత్ పెళ్లి తేదీ ఖరారైయింది.గత ఏడాది తన ప్రేయసి సిరి లెల్ల (శిరీష) తో నిశ్చితార్ధం జరుగగా ఈనెల 30న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. అందుకు సంబంధించిన పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.నాలుగు రోజులు ఈ పెళ్లి కార్యక్రమాలు గ్రాండ్ గా జరుగనున్నాయి.ఈ పెళ్లికి రాజకీయ ప్రముఖులతోపాటు సినిమా స్టార్లు హాజరుకానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రతినిధి 2 షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ నారా రోహిత్ – సిరి పెద్దల అంగీకారంతో గత ఏడాది వీరి నిశ్చితార్థం జరిగింది.అయితే ఆ తరువాత కొద్దీ రోజులకే అనారోగ్యం కారణంగా నారా రోహిత్ తండ్రి మృతి చెందడం తో పెళ్లి వాయిదా పడింది.ఇక సంవత్సరీకం పూర్తి కాగానే పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – భువనేశ్వరి పెళ్లి పెద్దలుగా వ్యవహరించనుండగా లోకేష్ – బ్రాహ్మణి పెళ్లి పనులు చూసుకుంటున్నారు.
ఇక సినిమా ల విషయానికి వస్తే రీసెంట్ గానే నారా రోహిత్ మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అయ్యాడు.చాలా గ్యాప్ తరువాత గత ఏడాది ప్రతినిధి 2 తో ప్రేక్షకులముందుకు రాగా ఈఏడాది భైరవం , సుందరకాండ తో పలకరించాడు.త్వరలోనే తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























