సంక్రాంతి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చిన సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 77వ సినిమా చేయనున్నారని తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమాను అఫీషియల్ గా లాంఛ్ కూడా చేశారు.ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది.మరి కొద్దీ రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. వీలైనంత తొందరగా ఈసినిమాను కంప్లీట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారని రీసెంట్ గా వార్తలు వచ్చాయి.అందులో భాగంగా హిట్ 3 ఫేమ్ శ్రీనిధి శెట్టి ని ఇందులో హీరోయిన్ గా తీసుకున్నారని న్యూస్ బయటికి వచ్చింది. ఇక ఈవిషయాన్ని మేకర్స్ కూడా కన్ ఫర్మ్ చేశారు. నిన్న శ్రీనిధి బర్త్ డే సందర్భంగా బర్త్ డే విషెష్ తెలుపుతూ సినిమాలోకి ఆహ్వానించారు మేకర్స్.యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఇక ఇంతకుముందు వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్ ,మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ స్టోరీ& డైలాగ్స్ అందించాడు.ఇందులో నువ్వు నాకు నచ్చావ్ ఆల్ టైం కల్ట్ మూవీ గా పేరు తెచ్చుకోగా మల్లీశ్వరి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కలిసి సినిమా చేయనుండడంతో వీరి కాంబోలో వస్తున్న వెంకీ 77పై అంచనాలు భారీగా వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























