700కోట్ల క్లబ్ లో కాంతార చాప్టర్ 1 

Kantara Chapter 1 Joins the 700 Crore Club

విడుదలై మూడు వారం లోకి ఎంట్రీ ఇచ్చినా ఏమాత్రం స్లో అవ్వకుండా దేశ వ్యాప్తంగా  భారీ వసూళ్లతో రాంపేజ్ కొనసాగిస్తోంది  కాంతార చాప్టర్ 1.నిన్నటి తో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 700కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. దాంతో  ఈఏడాది  ఈ ఘనత సాధించిన  రెండో సినిమాగా  రికార్డు సృష్టించింది.ముఖ్యంగా కర్ణాటకలో ఈసినిమా రాంపేజ్ కొనసాగిస్తుంది.నిన్నటితో అక్కడ 200 కోట్ల మార్క్  క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇక మలయాళం  లోకూడా  సాలిడ్ వసూళ్లతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. నిన్నటితో కేరళలో 50కోట్ల గ్రాస్ వసూళ్లను  రాబట్టుకుంది.తమిళంలో కూడా 50కోట్లకుపైగా వసూళ్లతో  బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హిందీలో నిన్నటితో  150 కోట్ల క్లబ్ లో చేరగా  తెలుగు రాష్ట్రాల్లో  100కోట్ల వసూళ్లను రాబట్టి  సూపర్ రన్ ను కొనసాగిస్తోంది. ఓవరాల్ గా  ఈసినిమా 14రోజుల్లో 717.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ ప్రకటించారు.ఫుల్ రన్ లో  800కోట్ల  క్లబ్ లో చేరనుంది.

 బ్లాక్  బస్టర్ కాంతార కు  ప్రీక్వెల్ గా రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.