నవ దళపతి సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ సూపర్‌నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ ‘జటాధర’ నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా (Ess Kay Gee ఎంటర్టైన్మెంట్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, డివోషనల్ ఫాంటసీ హారర్ జానర్ ని రిడిఫైన్ చేసేలా వుంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ప్రేక్షకులకు టెర్రిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ట్రైలర్ లాంచ్ చేసిన మహేష్ బాబు గారికి థాంక్యూ. చిన్నప్పుడు విన్న ఓ స్త్రీ రేపు రా, లంకె బిందెలు కదలి విన్నప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. వెంకట్ వచ్చి కథ చెప్పినప్పుడు అంతేగా థ్రిల్ అనిపించింది. ఆడియన్స్ కూడా థియేటర్స్ లో అదే థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంది. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తారు.”
“సోనాక్షి చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకెవరు కూడా మ్యాచ్ చేయలేరు. ధన పిశాచి పవర్ ఫుల్ రోల్. సోనాక్షి మరింత పవర్ ని యాడ్ చేశారు. డైరెక్టర్ వెంకట్ అభిషేక్‌కి ఇది ఫెంటాస్టిక్ డెబ్యూ. క్లాస్, మాస్ అందరికీ కనెక్ట్ స్క్రిప్ట్ ఇది. పక్కగా తెలుగు హిందీలో రిలీజ్ అవుతుంది. శిల్పా క్యారెక్టర్ ఇందులో చూస్తే భయమేస్తుంది. సినిమా ఒక దమ్ బిర్యానిలా తయారైంది. ఆడియన్స్ మనీ, టైంకి వాల్యూ ఇచ్చినప్పుడు ఆ సినిమా 100% బ్లాక్ బస్టర్. జటాధర కూడా 100% బ్లాక్ బస్టర్. నవంబర్ 7న ఇంట్లో ఉన్న అందరిని తీసుకెళ్లండి. ఈ సినిమా చూసి వాళ్లంతా మిమ్మల్ని పొగుడుతారు. థాంక్యూ” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























