దక్షిణాది సినీ పరిశ్రమలో తన అద్భుత నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న జాతీయ పురస్కార గ్రహీత, అందాల నటి కీర్తి సురేశ్ నేడు (అక్టోబర్ 17) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, ఆమె తదుపరి చిత్రం ‘SVC59’ (వర్కింగ్ టైటిల్) టీమ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“టీమ్ SVC59 నుంచి అద్భుత నటి కీర్తి సురేశ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము” అంటూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఈ పోస్టర్లో నటి కీర్తి సురేష్‌ని ఒక అద్భుతమైన, కవితాత్మక శైలిలో చూపించారు.ఈ పోస్టర్లో కీర్తి సురేశ్ సిల్హౌట్ (నలుపు నీడ రూపం)లో కనిపిస్తుంది. ఆమె ఆకృతి లోపల ఎరుపు మరియు నలుపు రంగుల మేళవింపుతో రూపుదిద్దుకుంది. కీర్తి సురేశ్ వ్యక్తిత్వానికి అద్భుతంగా సరిపోయేలా ఉంది.
పోస్టర్‌లోని ట్యాగ్‌లైన్ — “Her love is poetry. Soul is the song.” (ఆమె ప్రేమ కవిత, ఆత్మ సంగీతం) — ఆమె పాత్ర ఎంత లోతైనదో, భావోద్వేగపూరితమో తెలియజేస్తుంది. కీర్తి సురేశ్ భంగిమలో శాంతతతో కూడిన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అలాగే భావోద్వేగం, అంతరంగ బలాన్ని సూచిస్తున్నాయి ఇది ఆమె పాత్రలోని శక్తిని, సున్నితత్వాన్ని ఒకేసారి ప్రతిబింబిస్తుంది. మొత్తంగా ఈ పోస్టర్ కవితాత్మకమైన, గాఢమైన మరియు శిల్పాత్మకమైన వాతావరణంను సృష్టించింది.
ఈ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం తాజాగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ మూవీలో నటించనున్న ఇతర కీలక నటీ,నటులు మరియు పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాల కీలక అప్డేట్లను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























