పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఓజీగా టైటిల్ రోల్లో పవర్ ఫుల్ నటనతో ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు. ఆయన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం పవర్‌స్టార్ అభిమానులకు మాస్ విజువల్ ఫీస్ట్ అందించింది. ఇంతకుముందెన్నడూ చూపించని రీతిలో పవన్ కళ్యాణ్‌ను చూపించింది. దీంతో ఓజీ థియేటర్లలో కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్ల సునామీని సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
థియేటర్లలో అలరించిన తర్వాత ఇప్పుడు డిజిటిల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా త్వరలో ఓటీటీ లోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 23 నుంచి ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు సదరు ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది.
ఓజీ కథ..?
1990లో ముంబై నేపథ్యంగా సాగే కథ ఇది.ముంబైలో సత్యా దాదా (ప్రకాష్ రాజ్) కంట్రోల్లో ఉండే షిప్ యార్డ్‌కు ఒక భారీ షిప్ చేరుతుంది. ఆ షిప్‌లోని ఒక కంటైనర్‌లో ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ ఉంటుంది. ఆ కంటైనర్ వెనుక ఉన్నది ఓమి (ఇమ్రాన్ హష్మీ) అనే శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్. ఆ కంటైనర్ తీవ్రవాదుల చేతికి చేరితే నగరం నాశనమవుతుందనే సత్యా దాదాకు బాగా తెలుసు. అందుకే అతడు దానిని దాచేస్తాడు.
కానీ ఆ కంటైనర్ కోసం ఓమి స్వయంగా ముంబైలో అడుగుపెడతాడు. సత్యా దాదా మనుషుల్ని ఒక్కొక్కరి చంపేసుకుంటూ వెళ్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో సత్యా దాదా, అతని వర్గాన్ని రక్షించగల ఒక్కరే ఉన్నాడని అందరూ అనుకుంటారు. అతడే ఓజస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్). అయితే ఓజీకి ముంబైతో, సత్యా దాదాతో ఉన్న గత సంబంధం ఏమిటి? పదిహేనేళ్ల క్రితం ముంబై వదిలి వెళ్లిపోయిన అతను మళ్లీ ఎందుకు వస్తాడు? ఓమిని ఎదిరించి అతడు ఏం చేశాడు? అనేది మిగితా కథ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























