కోలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ మరియు అందాల నటి మమితాబైజు జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘డ్యూడ్’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో విడుదలైన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కిర్తీశ్వరన్ రచన మరియు దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. గ్రాండ్ దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్‌లో తొలిరోజే మంచి వసూళ్లు సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నార్త్ అమెరికా అప్‌డేట్:
తాజా సమాచారం ప్రకారం, ‘డ్యూడ్’ సినిమా ఉత్తర అమెరికాలో విడుదలైన వెంటనే $30K (ముప్పై వేల డాలర్లు) గ్రాస్ వసూళ్లను దాటింది. అంతేకాకుండా, వసూళ్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా, “VIBE with DUDE” అంటూ మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర విజయాన్ని సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకుంటోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర ఈ సినిమాను నార్త్ అమెరికాలో విడుదల చేసిన విషయం తెలిసిందే.
రచయితగా మరియు దర్శకుడిగా ఈ యంగ్ డైరెక్టర్ తన తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకోవడం పట్ల సినీ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, సీనియర్ నటుడు శరత్ కుమార్ పాత్ర సినిమాలో కీలకంగా నిలిచిందని ఆడియెన్స్ చెబుతున్నారు. మరోవైపు ‘లవ్ టుడే, డ్రాగన్’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న ప్రదీప్, ఇప్పుడు డ్యూడ్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాడని అభిమానులు ఆనందపడుతున్నారు. దీనికి ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ వసూళ్లే నిదర్శనంగా వారు చూపుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























