సూపర్ సుబ్బు కంప్లీట్ డిఫరెంట్ ప్రాజెక్ట్ – మిథిలా పాల్కర్

Actress Mithila Palkar Shares Working Experience For Super Subbu

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో రూపొందుతోన్న కొత్త ప్రాజెక్ట్ ‘సూపర్ సుబ్బు’. అయితే ఇది సినిమాగా కాకుండా ఓ వెబ్ సిరీస్‌లా తెరకెక్కుతుండటం విశేషం. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాజీవ్ చిలకా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నటి మిథిలా పాల్కర్ మాట్లాడుతూ.. “సూపర్ సుబ్బు కామెడీ, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు అన్నీ కలగలసిన కథ. సుబ్బు అనే దురదృష్టపు యువకుడు చిన్న పట్టణంలోని పరిస్థితులతో, కఠినమైన తండ్రితో ఎలా పోరాడతాడో ఈ సిరీస్‌ చెబుతుంది. అతని ప్రయాణం ఒక గ్రామీణ నేపథ్యానికి చేరుతుంది. అక్కడ అతను ఒక సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కథ కొత్తదనం, హాస్యంతో నిండినదిగా ఉంటుంది, పాత్రలు చాలా దగ్గరగా అనిపిస్తాయి, కథ కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఇది నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టుల కంటే పూర్తిగా భిన్నమైనది” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.