ప్రేమంటే ఫస్ట్ సింగిల్ రిలీజ్ 

First Single from Premante Released

ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు.నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.”థ్రిల్-యు ప్రాప్తిరస్తు!” అనేది ట్యాగ్‌లైన్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఈఓజు  ఫస్ట్ సింగిల్ ‘దోచావే నన్నే’ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది.సాఫ్ట్ మెలోడీకి స్టైలిష్ విజువల్స్‌ను మేళవించి ప్రేమలో ఉన్న ఎమోషన్ ని అందంగా ప్రజెంట్ చేసింది. ఎలిగెంట్ డ్యాన్స్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి.అబ్బీ వి వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది. శ్రీమణి రాసిన సాహిత్యం హార్ట్ టచ్చింగ్ వుంది. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంది.

ఈ చిత్రానికి సహ నిర్మాత ఆదిత్య మెరుగు. ‘గామీ’ సినిమాకు గద్దర్ అవార్డు అందుకున్న సినిమాటోగ్రాఫర్ విష్ణునాథ్ రెడ్డి తన విజువల్ మ్యాజిక్‌తో ఫ్రేమ్‌లను అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. రాఘవేంద్ర ఎడిటర్,  ప్రొడక్షన్ డిజైన్‌ అరవింద్ ములే, డైలాగ్స్‌ కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్ అందించారు.ప్రేమంటే’ సినిమా మ్యూజిక్ డ్రైవన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈసినిమా అడియో రైట్స్ ను సరిగమ మ్యూజిక్ దక్కించుకుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ చెప్పనున్నారు మేకర్స్. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.