రణబాలి షూటింగ్ పూర్తి .. చెప్పిన డేట్‌కే రిలీజ్

RanaBaali Completes Its Entire Shoot

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ చిత్రీకరణపూర్తి చేసుకుంది. దాదాపు 130 రోజుల పాటు సాగిన ఈ సినిమా మొత్తం షూటింగ్ ప్రక్రియను చిత్ర బృందం దిగ్విజయంగా పూర్తి చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

19వ శతాబ్దంలో (1854-1878) బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ పాన్-ఇండియా చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. షూటింగ్ పూర్తవ్వడంతో ప్రస్తుతం చిత్ర బృందం పూర్తిస్థాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించింది.పెళ్లి తరువాత విజయ్ – రష్మిక కలిసి నటించిన సినిమాకావడంతో రణబాలిపై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.