ఇరుముడి టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi Meets the Irumudi Team and Extends Special Congratulations

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. సినిమా థియేట్రికల్ సక్సెస్‌ను పురస్కరించుకుని ‘ఇరుముడి’ కోర్ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించిన చిరంజీవి, వారిని వ్యక్తిగతంగా అభినందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సందర్భంగా వారితో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా విడుదలైన ఫొటోల్లో చిరంజీవి, ‘ఇరుముడి’ టీమ్ మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం కనిపించింది.

బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ అంచనాలను మించి అద్భుతమైన విజయాన్ని అందుకుంటూ, సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నాలుగో వారంలోనూ సినిమా జోరు తగ్గలేదు. నేటి షోలకు కూడా బలమైన బుకింగ్స్ కొనసాగుతున్నాయి.

ఇలాంటి భారీ థియేట్రికల్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటికి ఆహ్వానించి అభినందించడం ‘ఇరుముడి’ టీమ్‌కు ప్రత్యేకమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భంగా నిలిచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.