మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానరపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ‘60 శాతం షూటింగ్ పూర్తయింది. అయితే, చిత్ర యూనిట్ ఇప్పటికే ఫస్టాఫ్ లాక్ చేసినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో నేటినుండి పూణేలో నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్‌పై అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు. కాగా, ఈ సాంగ్ కోసం అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ అదిరిపోయే సాంగ్‌ని కంపోజ్ చేసినట్టు సమాచారం. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉండనుందని టీమ్ పేర్కొంది.
ఇదిలావుంటే, మరోవైపు పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్ కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తయ్యేలా టీమ్ పాషన్‌తో పనిచేస్తోంది. ఇక ఇందులో తన పాత్ర కోసం చరణ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. కాగా, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న పాన్-ఇండియా వైడ్‌గా పెద్ది గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. ఈ జానర్లో తొలిసారి చరణ్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై అభిమానుల్లోనే కాక, సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























