కె – ర్యాంప్ ట్రైలర్ డేట్ ఫిక్స్

Kiran Abbavaram’s K-Ramp Trailer Release Date Announced

గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈదీపావళికి కె -ర్యాంప్ తో వస్తున్నాడు. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ ట్రైలర్ రానుంది. ఈనెల 11న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను డైరెక్ట్ చేయగా యుక్తి థరేజా హీరోయిన్ గా నటించింది.కామ్నా జఠ్మలానీ , నరేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా హాస్య మూవీస్ బ్యానర్ పై రాకేష్ దండా నిర్మిస్తున్నారు.ఈనెల 17న విడుదలకానుంది. అయితే అదే రోజు మరి కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి.దాంతో కె – ర్యాంప్ కు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.

ఇక వరుస పరాజయాల తరువాత గత ఏడాది క తో సాలిడ్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం.అయితే ఈసినిమా తరువాత దిల్ రూబా తో వచ్చి పరాజాయాన్ని చవి చూశాడు. ఇక ఇప్పుడు కె -ర్యాంప్ తో రానున్నాడు.మరి మరోసారి కిరణ్ కు దీపావళికి సెంటిమెంట్ కలసిసొస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.