తమిళ్ స్టార్ హీరో విష్ణు విశాల్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్యన్’. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రవీణ్ కె రచించి, దర్శకత్వం వహించగా.. శుభ్ర & ఆర్యన్ రమేష్ సమర్పణలో, విష్ణు విశాల్ స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగించుకుని పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ అందించారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న ఆర్యన్ థియేటర్లలో విడుదల కానుండగా.. తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది.
కాగా, తమిళంలో మంచి విజయాన్ని అందుకుంటున్న విష్ణు విశాల్.. తెలుగులో కూడా తన మార్కెట్‌ను విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల భర్తగానే కాకుండా, నటుడిగానూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విష్ణు విశాల్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. క్రైమ్, సస్పెన్స్ అంశాలు ప్రధానంగా ఉండే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























