కాంతార చాప్టర్ 1.. ఓవర్సీస్‌లోనూ అదే హవా..!

Kantara Chapter 1 Roars With Massive Collections at North America Box Office

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1’’. రిషబ్ సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించగా.. గుల్షన్ దేవయ్య, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా లెవెల్లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా, అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొన్న గాంధీ జయంతి, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనంగా మారింది. తాజాగా అమెరికా బాక్సాఫీస్‌లోనూ అద్భుతమైన వసూళ్లు రాబడుతూ సక్సెస్ ట్రాక్‌పై దూసుకుపోతోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఉత్తర అమెరికాలో ఈ సినిమా ఇప్పటివరకు $1.2 మిలియన్ (రూ. 10 కోట్లకు పైగా) వసూళ్లు సాధించింది. రోజురోజుకీ ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. మొదటి రోజు నుంచే వచ్చిన పాజిటివ్ టాక్, ఫోక్ కల్చర్ ఆధారంగా సాగే కథ, రిషబ్ శెట్టి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకి బలంగా నిలుస్తున్నాయి.

ఇక ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, రిషబ్ శెట్టి స్వయంగా రచన, దర్శకత్వం వహించారు. అజినీష్ లోక్ నాథ్ అదిరిపోయే సంగీతం అందించగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. మొత్తానికి దసరా సీజన్‌కి ఈ సినిమా మరో బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.