వరుణ్ తేజ్ తనయుడి నామకరణం.. పేరేంటంటే?

Varun Tej and Lavanya Tripathi Named Their Son Vaayuv Tej Konidela

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి దంపతులు ఇటీవలే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ స్టార్ కపుల్, వారి అభిమానుల సంతోషాన్ని మరింతగా పెంచుతూ.. తాజాగా దసరా పండుగ సందర్భంగా తమ కొడుకు పేరును అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వరుణ్ తేజ్ మరియు లావణ్య తమ కుమారుడికి ‘వాయువ్ తేజ్ కొణిదెల’ అని పేరు పెట్టారు. ఈ పేరుకు ఒక ప్రత్యేక అర్థం కూడా ఉంది. ఈ పేరు ‘అజేయమైన శక్తి, అచంచలమైన భక్తి, ధైర్యం మరియు ఆధ్యాత్మిక ప్రకాశాన్ని’ ప్రతిబింబిస్తుందని, ముఖ్యంగా ఆంజనేయ స్వామి (వాయు పుత్రుడు) స్ఫూర్తిని నింపుతుందని వారు తెలిపారు.

వాయువ్ తేజ్ కొణిదెల పేరును ప్రకటించిన సందర్భంగా, వరుణ్ తేజ్ మరియు లావణ్య తమ కొడుకుతో ఉన్న ఆప్యాయతతో కూడిన ఫోటోలను, అలాగే నామకరణ వేడుక వీడియోను కూడా పంచుకున్నారు. ఈ ప్రత్యేకమైన, శక్తివంతమైన పేరుపై మెగా ఫ్యాన్స్ మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొణిదెల కుటుంబంలోకి అడుగుపెట్టిన ఈ కొత్త వారసుడి పేరు ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.