NBK111 లాంచ్ అప్‌డేట్‌

Nandamuri Balakrishna-Gopichand Malineni's NBK111 Launch Date Fixed

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నారు, ప్రతి కొత్త రిలీజ్ తో తన రికార్డులను తిరగరాస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిస్టారికల్ ఎపిక్ #NBK111 ను ఆయన పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ ‘వీరసింహ రెడ్డి’ తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న రెండవది కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా విజయ దశమి శుభ సందర్భంగా, #NBK111 మేకర్స్ ఈ చిత్రం ప్రారంభానికి ముహూర్తం ప్రకటించారు. అక్టోబర్ 24న గ్రాండ్ ఓపెనింగ్ వేడుక జరగనుంది. ఇక ప్రస్తుతం ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ని నిర్మిస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో, #NBK111 ను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

మొదటిసారిగా, దర్శకుడు గోపీచంద్ మలినేని హిస్టారికల్ ఎపిక్ జానర్ లో సినిమా చేస్తున్నారు, తనదైన ముద్ర వేసిన మాస్ అప్పీల్‌ను కొత్త జానర్ కి తీసుకువస్తున్నారు. కమర్షియల్ గా బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో పేరుగాంచిన గోపీచంద్ మలినేని ఇప్పుడు నందమూరి బాలకృష్ణను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతార్ లో చూపించే కథనాన్ని రూపొందిస్తున్నారు.

గొప్ప చారిత్రక నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ చిత్రం, ఇంటెన్స్, ఎమోషన్, యాక్షన్, అద్భుతమైన విజువల్స్, లార్జర్ దెన్ లైఫ్ గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో వుంది. ఇక ఈ సినిమాకి పనిచేయనున్న సహాయక తారాగణం, సాంకేతిక సిబ్బంది వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.