చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది లిటిల్ హార్ట్స్.నిజానికి డైరెక్ట్ గా ఓటీటీ లోకి రిలీజ్ చేద్దాం అనుకున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు ,వంశీ నందిపాటి చూసి వారికీ నచ్చడంతో థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు.అలా థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి ఫుల్ రన్ లో భారీ లాభాలు తీసుకొచ్చింది.కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా ఫుల్ రన్ లో 35కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి,యువ హీరోయిన్ శివాని నాగరం జంటగా నటించిన ఈసినిమాను సాయి మార్తాండ్ తెరకెక్కించగా సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించాడు.ఈ టీవీ విన్ తో కలిసి #90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈసినిమాను నిర్మించాడు.
ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.ఈటీవీ విన్ అక్టోబర్ 1న ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.అయితే థియేటర్లలో 2 గంటల 5 నిమిషాల రన్ టైంతో వచ్చిన ఈసినిమా ఓటీటీలోకి మాత్రం ఎక్స్టెండెడ్ కట్ తో రానుంది.దాదాపు 15 నిమిషాల ఫుటేజ్ యాడ్ కానుంది.ఇక ఇంతకుముందు లిటిల్ హార్ట్స్ అక్టోబర్ 2న స్ట్రీమింగ్ లోకి వస్తున్నట్లు వచ్చిన వార్తలను ఫేక్ అన్నఈ టీవీ విన్ ఇప్పుడు అంతకన్నా ఒక్క రోజు ముందే రిలీజ్ చేయనుండడం కోస మెరుపు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























