పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నార్త్ అమెరికాలో సాలిడ్ హోల్డ్ తో దూసుకుపోతుంది.నిన్నటితో ఈసినిమా అక్కడ 4 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు 4.2 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈ వీకెండ్ కల్లా 5 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.ఇప్పటికే పవన్ కెరీర్ ఓజీ హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ లో 6 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఓజీ రెండో రోజు కూడా జోరు కొనసాగించింది. ఈరోజు, రేపు కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టుకోనుంది.ఈ వీకెండ్ కల్లా 250కోట్ల మార్క్ చేరుకునే ఛాన్స్ లేకపోలేదు.
గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో పవన్ నెవర్ బిఫోర్ రోల్ లో కనిపించాడు.ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ , శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు.తమన్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ సినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























