ఢిల్లీలో 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.2023కి అవార్డులను ప్రకటించగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదగా ఈరోజు విజేతలు ఈ అవార్డులను అందుకుంటున్నారు.అందులో భాగంగా జాతీయ ఉత్తమ నటులుగా షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ (12th ఫెయిల్), జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) అవార్డు అందుకున్నారు.అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కి గాను డైరెక్టర్ అనిల్ రావిపూడి , నిర్మాత సాహు గారపాటి అవార్డు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా హనుమాన్ సినిమాకు గాను నందు & పృథ్వీ అవార్డు దక్కించుకోగా ఉత్తమ గేయ రచయిత గా కాసర్ల శ్యామ్ అవార్డును కైవసం చేసుకున్నారు. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకి గాను శ్యామ్ ఈ అవార్డు గెలుచుకున్నారు.ఇక ఉత్తమ నేపథ్య గాయకుడిగా బేబీ సినిమాకి గాను పివిఎన్ ఎస్ రోహిత్ అవార్డు దక్కించుకోగా ఇదే సినిమాకు గాను బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు సాయి రాజేష్ అవార్డు అందుకున్నారు.అలాగే ఉత్తమ బాల నటిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణు అవార్డు గెలుచుకుంది. గాంధీతాతా చెట్టు లో నటనకు గాను సుకృతిని ఈ అవార్డు వరించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























