పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నమచ్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ నుండి తాజాగా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. పవన్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ట్రైలర్ రిలీజైన క్షణం నుండే అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానుల్లో జోష్ నింపాయి. అయితే ముఖ్యంగా పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగులు హైలైట్‌గా నిలిచాయి. అలాగే పవన్ డైలాగులు మాత్రమే కాదు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ట్రైలర్‌కి మరింత బలం చేకూర్చాయి. ఇక ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది.
- ‘ముంబై’లో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్నీ సత్య దాదా వైపు తిరిగాయ్. దాదా వరకూ వెళ్లారంటే పరిస్థితి చెయ్యి దాటిపోతున్నట్లుంది’ అంటూ శుభలేఖ సుధాకర్ గంభీరమైన వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది.
- ‘అందరు గ్యాంగ్‌స్టర్స్ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే…’ అంటూ మాస్ ఎలివేషన్‌తో పవన్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.
- ‘నిన్ను కలవాలని కొందరు.. చూడాలని ఇంకొందరు.. చంపాలని అందరూ ఎదురుచూస్తున్నారు’ అనే డైలాగ్ హైప్ ఇస్తోంది.
- ‘ముంబయికి వస్తున్నా… తలలు జాగ్రత్త’ అంటూ విలన్లకు ఇచ్చే వార్నింగ్ ఓ రేంజ్‌లో ఉంది.
- ‘ఓజాస్ గంభీర నా కొడకల్లారా’ అంటూ చివరిగా పవన్ ఫుల్ ఫైర్‌తో చెప్పిన డైలాగ్ అయితే థియేటర్లను ఊపేసేలావుంది.
దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, అర్జున్ దాస్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























